పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన డీకే అరుణ

బీజేపీలో కొందరు సీనియర్లు పోటీ చేయడానికి సముఖంగా లేరని, మరికొందరు పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరుగుతున్న..

Update: 2023-10-26 06:21 GMT

ఒక వైపు తెలంగాణలోని అన్ని పార్టీలు ఎన్నికల మోడ్‌లో ఉన్నాయి. వివిధ పార్టీల నేతలు టికెట్ల కోసం ఆశిస్తుంటే మరి కొందరేమో పార్టీ మార్పులపై దృష్టి పెడుతున్నారు. టికెట్‌ రాని వారు ఇతర పార్టీల వైపు దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు పార్టీ మారుతున్నట్లు పుకార్లు షికార్లు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ మార్పుపై

బీజేపీలో కొందరు సీనియర్లు పోటీ చేయడానికి సముఖంగా లేరని, మరికొందరు పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆమె ఖండించారు. మీడియాలో తాను కాంగ్రెస్ పార్టీ లో చేరుతునట్లు వస్తున్న వార్తలు అబద్దమన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

కొందరు కాంగ్రెస్ నేతలు కావాలని మైండ్ గేమ్ ఆడుతున్నారని, బీజేపీ తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పని చేయడానికి అదృష్టం ఉండాలని, కనీసం తన స్పందన తీసుకోకుండా వార్త కథనాలు రాయడం సరైంది కాదని మండిపడ్డారు. తన రాజకీయ భవిష్యత్ నిర్ణయించాల్సిన హక్కు ఎవరు ఇచ్చారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ లో తన చేరికపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనపై దుష్ప్రచారం చేసిన మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానని డీకే అరుణ అన్నారు.

ఇటీవల తెలంగాణ బీజేపీ ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా ఆయన బీజేపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దానికి తగ్గట్టుగా బీజేపీ విడుదల చేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. ఈ క్రమంలో వారం రోజుల క్రితమే పార్టీ మార్పుపై ఆయన హింట్ ఇచ్చారు. మునుగోడు ప్రజల ఆలోచనలకు అనుగుణంగా తన నిర్ణయం ఉంటుందని ప్రకటించిన రాజగోపాల్‌రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్‌లో చేరనున్నట్టు ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News