Telangana : నేడు కులగణనపై గాంధీభవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేడు కులగణణపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేడు కులగణణపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. గాంధీభవన్ లో ఈ కార్యక్రమాన్ని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన, ఎస్సీ వర్గీకరణపై పార్టీ నేతలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
ప్రతిపక్ష నేతల విమర్శలకు...
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి దీపాదాస్ మున్షీ తదితరులు పాల్గొననున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు గాంధీభవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. విపక్షాలు కులగణన సర్వేపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో నేతలు దీటుగా సమాధానం ఇచ్చేందుకు ప్రిపేర్ అయ్యేలా ఈ అవగాహన కార్యక్రమం ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు.