Kamareddy : కామారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

కామారెడ్డిలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు పర్యటించారు.

Update: 2025-08-31 11:30 GMT

కామారెడ్డిలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు పర్యటించారు. ఇటివల కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి ప్రాంతంలో వరద ముంపునకు గురైన ప్రాంతాలను ఎమ్మెల్సీలు పరిశీలిలించారు. వరదలు కామారెడ్డిని అతలాకుతలం చేశాయి కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి అన్నారు. కామారెడ్డిలో ఇంత జరుగుతుంటే బీజేపీ ఏం చేస్తుందని విజయశాంతి ప్రశ్నించారు.

కేంద్రానికి నివేదిక...
స్థానిక ఎమ్మెల్యే కనిపించలేదని బాధితులు అంటున్నారని, వరద బాధితులను ఆదుకునేందుకు సినీ పరిశ్రమ ముందుకు రావాలని ఎమ్మెల్సీ విజయశాంతి పిలుపు నిచ్చింది. బీఆర్‌ఎస్‌ వరద రాజకీయాలు చేస్తోందని అద్దంకి దయాకర్ రావు అన్నారు. నష్టపరిహారం కోసం నివేదికలు సిద్ధం చేస్తున్నామని, కేంద్రాన్ని రూ పదివేల కోట్ల సాయం అడిగామని అద్దంకి దయాకర్ అన్నారు.


Tags:    

Similar News