Telangana : నేడు గవర్నర్ వద్దకు కాంగ్రెస్ నేతలు

తెలంగాణ కాంగ్రెస్ నేతలు నేడు రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. గవర్నర్ విష్ణుదేవ్ వర్మతో సమావేశం కానున్నారు.

Update: 2025-09-01 04:06 GMT

తెలంగాణ కాంగ్రెస్ నేతలు నేడు రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. గవర్నర్ విష్ణుదేవ్ వర్మతో సమావేశం కానున్నారు. గవర్నర్ వద్దకు వెళ్లి తాము అసెంబ్లీలో తీర్మానించి ఆమోదించిన బిల్లులకు ఓకే చేయాలని కోరనున్నారు. స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు, పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణలను చేస్తూ నిన్న తెలంగాణ శాసనసభ తీర్మానం చేసి ఆమోదించిన సంగతి తెలిసిందే.

గవర్నర్ ను కలసి బిల్లులను...
దీనిపై గవర్నర్ ను కలసి బిల్లులను ఆమోదించాలని కాంగ్రెస్ నేతలు కోరనున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో పాటు కొండా సురేఖ మరికొందరు బీసీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా గవర్నర్ వద్దకు వెళ్లి ఆయనకు విన్నవించనున్నారు. బీసీల రిజర్వేషన్ ఆర్డినెన్స్ ను రాష్ట్రపతికి గవర్నర్ పంపిన నేపథ్యంలో నేడు గవర్నర్ వద్దకు కాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు.










Tags:    

Similar News