Congress : నేడు కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం కమిటీ సమావేశం
నేడు తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం కమిటీ సమావేశం జరగనుంది.
నేడు కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా అనేక అంశాలపై చర్చించనున్నారు. అయితే ఈరోజు జరిగే సమావేశంలో కీలక నిర్ణయం ఉండబోతుందా? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వరంగల్ లో కొండా వర్గంతో వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు ఏకమయ్యారు.ఇద్దరు పరస్పరం క్రమశిక్షణ సంఘం పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై...
అయితే ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేస్తున్న వరస కామెంట్స్ పై కూడా క్రమశిక్షణ కమిటీ చర్చించనుంది. పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులతో పాటు తాజా పరిణామాలపై మల్లు రవి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది. దీనిపై నేడు చర్చించనుండటంతో పిలిచి వారి వివరణ అడుగుతారా? లేదా? నోటీసులతో సరిపెడతారా? అన్నది చూడాల్సి ఉంది. రేపు ఉదయం పదకొండు గంటలకు జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.