Congress : పీసీసీ కార్యవర్గం జోలికి వెళ్లని ఏఐసీసీ
తెలంగాణ కాంగ్రెస్ కమిటీలకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కమిటీలను ఏఐసీసీ నియమించింది
తెలంగాణ కాంగ్రెస్ కమిటీలకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. చాలా రోజుల తర్వాత అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ కమిటీలకు ఏఐసీసీ ఆమోదం తెలిపింది. ఇరవై రెండు మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని నియమించింది. పదిహేనుమందితో అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఏడుగురు సభ్యులతో డీలిమిటేషన్ కమిటీ ని ఏఐసీసీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కమిటీలకు గ్రీన్ సిగ్నల్...
కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర మంత్రులు, కమిటీలో తెలంగాణ ఇంఛార్జ్ ఏఐసీసీ సెక్రటరీలకు స్థానం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. మొదటిసారి అడ్వైజరీ కమిటీ వేసిన ఏఐసీసీ అందులో ముఖ్యమైన వారికి చోటు కల్పించింది. క్రమశిక్షణి కమిటీ ఛైర్మన్ గా ఎంపీ మల్లు రవిని నియమించడం విశేషం. అదనపు కమిటీలకే పరిమితమైన ఏఐసీసీ.. పీసీసీ కార్యవర్గం జోలికి మాత్రం ఏఐసీసీ వెళ్లలేదు.