Telangana : పీసీసీ చీఫ్ ఇచ్చింది వార్నింగా? లేక టిక్కెట్ రాదని తేల్చేశారా?

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు.

Update: 2025-06-06 12:07 GMT

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేలను ఆయన హెచ్చరించారు. చాలా మంది ఎమ్మెల్యేలు తమ పనితీరును మార్చుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేల పనితీరు బాగా లేదని తెలిసింది. చాలా మంది ఎమ్మెల్యేల పనితీరు ఇబ్బందికరంగా ఉందని, పనితీరులో మార్పులు చేసుకోకుంటే కష్టమేనన అన్నాుు. పనితీరును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపైనే ఉంటుందని చెప్పారు. నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్న మాట మాత్రం వాస్తవమేనని వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలనికోరారు.

పార్టీ హైకమాండ్ కు నివేదిక...
అసలు మహేశ్ కుమార్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణాలు ఏంటన్నది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. పీసీసీ చీఫ్ గా ఏదైనా ఎమ్మెల్యేల పనితీరు పై సర్వేలు నిర్వహించారా? లేక తనకు అందిన సమాచారాన్ని బట్టి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా? అన్న దానిపై చర్చ జరుగుతుంది. అయితే మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలను చేపట్టిన తర్వాత ఎన్నడూ ఈ తరహా వ్యాఖ్యలు చేయలేదు. ఆయన తనకు అందిన నివేదికను పార్టీ అధినాయకత్వానికి కూడా పంపే అవకాశాలుండటంతో ఖచ్చితంగా ఎమ్మెల్యేలు సీరియస్ గా మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాల్సిందే. ఎందుకంటే టిక్కెట్లు ఖరారు చేసేది కాంగ్రెస్ లో అధినాయకత్వమే.
రేవంత్ తో పాటు మహేశ్ కూడా...
మరొకవైపు ఇటీవల రేవంత్ రెడ్డి కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ కే పరిమితమయ్యారని, నియోజకవర్గాల్లో తిరగడం లేదని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు వివరించడంలో ఫెయిల్ అవుతున్నారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వాటిని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయడమే కాకుండా అవసరమైన నిధులను కూడా అందచేస్తామని చెబతున్నారు. ఈ సమయంలో మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ హోదాలో చేసిన వ్యాఖ్యలను మాత్రం ఆషామాషీగా తీసుకుంటే ఈసారి టిక్కెట్ కూడా కొందరికి రావడం కష్టమేనని సమాచారం.


Tags:    

Similar News