తెలంగాణలో వచ్చే ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రచార కమిటీని ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. టీపీసీసీ ప్రచార కమిటీకి గతంలో చైర్మన్‌గా ఉన్న మధు యాష్కీ గౌడ్ కు మరోసారి అవకాశం కల్పించింది కాంగ్రెస్. కాంగ్రెస్ లో ఇటీవలే చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రచార కమిటీలో చోటు కల్పించింది. టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా నియమించినట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలు జారీ చేశారు.
టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్, ప్రవీణ్ రెడ్డి, కత్తి కార్తీక గౌడ్, మహ్మద్ జావేద్ అక్రమ్, నరేంద్ర ముదిరాజ్, జూలూరు ధనలక్ష్మి గౌడ్, చనగాని దయాకర్ గౌడ్, వరంగల్ రవి, నాగన్న, అముగోతు వెంకటేశ్, రాములు యాదవ్, దాస్ గౌడ్, కెప్టెన్ కరుణాకర్ రెడ్డి, గడుగు రోహిత్, బండ శంకర్, కోలా వెంకటేశ్, దినేశ్ సాగర్ ముదిరాజ్, గోపాల్‌రెడ్డి, దండెం రాంరెడ్డి, శ్రీకొండ మల్లేష్, కోట శ్రీనివాస్, గిరి కొండల్, సంగీతం శ్రీనివాస్, చారులత రాథోడ్, రేణుక, గిరి నాగభూషణం, భీం భరత్, కె.శివ కుమార్, సాయిని రవి, రఘువీర్ గౌడ్, డా.కె.విజయ్‌కుమార్, జి. లోకేశ్ యాదవ్, ఏఎం ఖాన్, జంగారెడ్డి, డా. వడ్డేపల్లి రవి, తాటికొండ శ్రీనివాస్, డా. మోతీ లాల్‌ను కార్యనిర్వాహక సభ్యులుగా ఉన్నారు.
లోక్ సభ స్థానాలకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు పర్యవేక్షకులను నియమించింది. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు పరిశీలకులు వీళ్లే
ప్రకాష్ రాథోడ్ - ఆదిలాబాద్
శ్రీనివాస్ మనే - భువనగిరి
అల్లం ప్రభు పాటిల్ - చేవెళ్ల
ప్రసాద్ అబ్బయ్య - హైదరాబాద్
క్రిస్టోఫర్ తిలక్ - కరీంనగర్
అరిఫ్ నసీం ఖాన్ - ఖమ్మం
పరమేశ్వర నాయక్ - మహబూబ్ బాద్
మోహన్ కుమార మంగళం - మహబూబ్ నగర్
రిజ్వాన్ హర్షద్ - మల్కాజ్ గిరి
బసవరాజ్ మాధవరావు పాటిల్ - మెదక్
పివి మోహన్ - నాగర్ కర్నూల్
అజయ్ ధరమ్ సింగ్ - నల్గొండ
సిడి మేయప్పన్ - జహీరాబాద్
బి.ఎం నాగరాజ - నిజామాబాద్
విజయ్ విజయ్ నామ్దేవ్ రావ్ - పెద్దపల్లి
రుబి ఆర్ మనోహరన్ -సికింద్రాబాద్
రవీంద్ర ఉత్తంరావు దల్వి - వరంగల్