Delhi : పార్లమెంటుకు చేరుకున్న రేవంత్ రెడ్డి

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు

Update: 2025-12-11 06:55 GMT

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన పార్లమెటుకు చేరుకున్నారు. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, మల్లికార్జు ఖర్గే , రాహుల్ గాంధీ ,ప్రియాంకను రేవంత్ రెడ్డి కలవనున్నారు. పార్టీ ప్రభుత్వ వ్యవహారాలపై అధిష్టాన ముఖ్యులతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు.

గ్లోబల్ సమ్మిట్ కు...
ఇటీవల రెండురోజుల పాటు హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన అంశాలను పార్టీ అగ్రనేతల ముందు ఉంచనున్నారు.నిన్న సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి ఎన్సీపి నేత శరద్ పవార్ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు. శరద పవార్ నివాసంలో రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.


Tags:    

Similar News