కేసీఆర్ ను కాపాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
telangana cm revanth reddy supporting kcr says kishan reddy
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఊచలు లెక్కపెట్టాల్సిన కేసీఆర్‌ను కాంగ్రెస్ పార్టీ కాపాడుతోందని విమర్శించారు. కేసీఆర్‌కు మేలు చేసేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోరుతూ కేంద్రానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేఖ ఎందుకు రాయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. న్యాయ విచారణ పేరుతో కేసీఆర్‌కు మేలు చేసేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే ముందు ఎలాంటి భూపరీక్షలు చేయలేదని.. ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోందని ఆరోపించారు.