కేసీఆర్ కలెక్టర్ల సమావేశం... అందుకే

సీఎం కేసీఆర్ నేడు జిల్లా కలెక్టర్లతో సమావేవం కానున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పథకాలపై ఆయన చర్చించనున్నారు.

Update: 2021-12-18 03:38 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జిల్లా కలెక్టర్లతో సమావేవం కానున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పథకాలపై ఆయన చర్చించనున్నారు. ముఖ్యంగా దళితబంధు పథకం అమలు ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా మారనుంది. దళిత బంధు పథకం ఉప ఎన్నికకు ముందు హుజూరాబాద్ వాసాలమర్రికే పరిమితం చేశారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా చింతకాని, తిరుమలగిరి, చారకొండ, నిజాంసాగర్ మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడంపై జిల్లా కలెక్టర్లతో కేసీఆర్ చర్చించనున్నారు.

వ్యవసాయ రంగంపై...
దీంతో పాటు వ్యవసాయరంగంపై కూడా కలెక్టర్లతో కేసీఆర్ చర్చించనున్నారు. వరి పంట వేయడం, ప్రత్యామ్నాయం పంటల సాగుపై రైతుల్లో అవగాహన కల్పించడం వంటి అంశాలపై కలెక్టర్లకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు కూడా పాల్గొననున్నారు.


Tags:    

Similar News