Revanth Reddy : నేడు కూడా ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఢిల్లీలో కొనసాగుతుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఢిల్లీలో కొనసాగుతుంది. నేడు కూడా ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి ఉండనున్నారు. ఈరో్జు ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశముందని తెలిసింది. ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ కోసం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించినట్లు చెబుతున్నారు. ప్రధాని మోదీ సమయం ఇస్తే కలిసి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై చర్చించాలని నిర్ణయించారు.
ప్రధానిని కలిసి...
మెట్రో పనుల విస్తరణకు అనుమతి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని రేవంత్ రెడ్డి కోరనున్నారు. దీంతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా నేడు రేవంత్ రెడ్డి కలిసి పలు ప్రాజెక్టులు, తెలంగాణకు రావాల్సిన నిధులపైన చర్చించనున్నారు. దీంతో పాటు పార్టీ పెద్దలను కలసి బీసీ రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించే అవకాశముంది. సాయంత్రం ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు తిరిగి వస్తారని తెలిసింది. సాయంత్రం ఇందిరమ్మ ఇళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు.