Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ బిజీబీజీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది.
Revanth reddy
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. నిన్న రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లిన రేవంత్ రెడ్డి ఈరోజు హోమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం ఆయన కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. వరదల వల్ల మరో నివేదికను కేంద్ర మంత్రులకు ఇచ్చే ఛాన్స్ ఉంది.
పార్టీ పెద్దలను కలసి...
తర్వాత రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలను కలవనున్నారు. మంత్రి వర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి చర్చించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి వర్గ విస్తరణ ఆవశ్యకతను గురించి కేంద్రంలోని పెద్దలకు వివరించి విస్తరణకు వారిని ఒప్పించే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చేయనున్నారు. ఈరోజు రాత్రికి తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి రానున్నారు.