Revanth Reddy : రెండో రోజు నేడు రేవంత్ ఢిల్లీలో

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది.

Update: 2025-07-08 04:12 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. నిన్న పలువురు కేంద్రమంత్రులను కలిసిన రేవంత్ రెడ్డి నేడు మరికొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. ఈరోజు జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, పియూష్ గోయల్, అశ్వని వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్, అమిత్ షాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశాలున్నాయి.

కేంద్ర మంత్రులను కలసి...
ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు సంబంధించిన పనులకు ఆమోదం తెలపాలని, బనకచర్ల ప్రాజెక్టుపై కూడా కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశముంది. మూసీ పునరజ్జీవ ప్రాజెక్టు, రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోటాకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్లపై పార్టీ కేంద్ర నాయకత్వంతో చర్చించే అవకాశముంది.


Tags:    

Similar News