Revanth Reddy : నేటి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ను నేడు అధికారులు విడుదల చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ను నేడు అధికారులు విడుదల చేశారు. నేడు విద్యుత్ శాఖాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశమై అధికారులతో చర్చించనున్నారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. దీంతో పాటు వేసవిలో విద్యుత్తు డిమాండ్, అందుకు అనుగుణంగా సరఫరా వంటి విషయాలపై కూడా రేవంత్ రెడ్డి చర్చించనున్నారు.
అకాల వర్షాలకు...
విద్యుత్తు శాఖపై సమీక్ష చేసిన అనంతరం మధ్యాహ్నం మూడున్నర గంటలకు వ్యవసాయశాఖపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. రుణమాఫీ అమలిన తీరుతో పాటు అకాల వర్షాలకు దెబ్బతిన్న ధాన్యం, నష్టపోయిన పంట అంచనాల వివరాలను కూడా రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకోనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు రేవంత్ రెడ్డి నాంపల్లి హజ్ హౌస్‌కు చేరుకుని హజ్ యాత్రికుల బస్సును జెండా ఊపి ప్రారంభించనున్నారు.