గవర్నర్ తో సీఎం రేవంత్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ను నేడు అధికారులు విడుదల చేశారు

Update: 2025-05-12 06:40 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ను నేడు అధికారులు విడుదల చేశారు. గవర్నర్ తో సమావేశమయ్యారు. ఉదయం పదకొండు గంటలకు గంటలకు గవర్నర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ సమావేశమయ్యారు. అయితే సమాచార కమిషనర్ల నియామకంపైనే గవర్నర్ తో చర్చించేందుకు రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు వెళ్లారని అధికారిక వర్గాలు తెలిపాయి.

సాఫ్ట్ వేర్ కంపెనీని..
సమాచార కమిషనర్లకు సంబంధించిన ఫైలు కొద్ది కాలం క్రితం ప్రభుత్వం రాజ్ భవన్ కు పంపింది. అయితే దానిపై గవర్నర్ ఇప్పటి వరకూ ఆమోదం తెలపకపోవడంతో దానిపై ఫాలో అప్ చేసేందుకు నేడు రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు చేరుకున్నారని, గవర్నర్ తో ఆ విషయంతో పాటు శాంతిభద్రతల విషయంపై కూడా చర్చించినట్లు చెబుతున్నారు. అనంతరం నానక్‌రామ్‌గూడలో సోనాటా సాఫ్ట్‌వేర్‌ క్యాంపస్‌ ను రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.


Tags:    

Similar News