Revanth Reddy : నేటి రేవంత్ రెడ్డి సమీక్షలు ఇవే

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.

Update: 2025-05-17 04:38 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. పలు సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. వివిధ శాఖలను సమీక్ష చేయనున్నారు. వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఉదయం 10:45 గంటలకు జేఆర్సీ కన్వెన్షన్‌కు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. అక్కడ జరిగే వి హబ్‌ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

వివిధ శాఖలపై సమీక్షలు...
మధ్యాహ్నం యంగ్ ఇండియా స్కిల్‌ వర్సిటీపై సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం .1:30 గంటలకు మైనింగ్ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఇసుక పంపిణీ విధానంపై అధికారులతో చర్చించనున్న రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 3:30 గంటలకు ఇరిగేషన్‌ విభాగంపై సమీక్ష చేయనున్నారు.


Tags:    

Similar News