Revanth Reddy : నేడు ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు.

Update: 2025-08-25 02:43 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు. ఉదయం పదకొండు గంటలకు ఉస్మానియా యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన హాస్టళ్ల భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అలాగే యూనివర్సిటీలోని వివిధ భవన నిర్మాణాలకు సంబంధించిన భూమి పూజలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు.

పలు అభివృద్ధి పనులకు...
ఈ నెల 21వ తేదీన జరిగిన రేవంత్ రెడ్డి పి.హెచ్.డి విద్యార్థుల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఆరోజు హాజరు కాలేదు. అయితే నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళతారు.


Tags:    

Similar News