Telangana : నేడు ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. నేడు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాలకు చెందిన ముఖ్యనేతలతో వరసగా రేవంత్ రెడ్డి సమావేశమవుతున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
సమస్యలను పరిష్కరిస్తూ...
కొన్ని ముఖ్యమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు, నేతలు కూడా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలని కోరనున్నారు. నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ఉంటూ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, అప్పుడే మరోసారి విజయం దక్కుతుందని దిశానిర్దేశం చేయనున్నారు.