రాత్రికి ఢిల్లీకి రేవంత్ రెడ్డి
ఈరోజు రాత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు
ఈరోజు రాత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఉదయం తొమ్మిది గంటలకు భారత జాతీయ కాంగ్రెస్, చట్టం, మానవ హక్కులు ఆర్టీఐ విభాగం నిర్వహించే వార్షిక సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.అందుకోసం ఈరోజు రాత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
సీఎంతో పాటు...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు సైతం ఈ సమావేశంలో పాల్గొననున్నారు. తిరిగి కార్యక్రమం పూర్తియిన వెంటనే ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ కు చేరుకుంటారు.