Revanth Reddy : నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రికి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రికి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రేపు కేంద్రజలశక్తి మంత్రితో జరిగే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇప్పటికే బనకచర్లపై సమావేశంలో అజెండాలో చేర్చవద్దని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలశక్తికి లేఖ రాసింది. ఎటువంటి అనుమతులు లేని బనకచర్లపై చర్చ చేయడం సమయం వృధా అని తాము భావిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.
అభ్యంతరాలను...
ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపైనే చర్చించాలని పట్టుబడుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గోదావరి, కృష్ణా జలాల నీటి కేటాయింపులతో పాటు ట్రైబ్యునల్ గతంలో ఇచ్చిన ఆదేశాలను సమావేశంలో వివరించేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. తన అభ్యంతరాలను కేంద్ర మంత్రి ముందు కుండబద్దలు కొట్టి వచ్చేయాలని తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయింది.