రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఏఐసీసీ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు
telangana chief minister revanth reddy will leave for delhi tomorrow.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఏఐసీసీ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఏఐసీసీ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై నేతలకు దిశానిర్దేశం అగ్రనేతలు చేయనున్నారు.
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత...
దీంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాము అమలు చేసిన గ్యారంటీల విషయం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో ప్రస్తావించనున్నారు. దీంతో పాటు పార్టీ పెద్దల నుంచి నామినేటెడ్ పోస్టులపై క్లారిటీ తీసుకోనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రేవంత్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.