Revanth Reddy : రేపు ఢిల్లీకి రేవంత్.. హైకమాండ్ తో కీలక భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు
Revanth reddy
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు. హైకమాండ్ ను కలిసి వివిధ అంశాలపై ఆయన చర్చించనున్నారని తెలిసింది. ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకూ సమీక్షలు, శాసనసభ సమావేశాలతో బిజిబిజీగా గడిపారు. ఆరు గ్యారంటీలలో రెండింటిని సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా అమలు చేశారు.
మంత్రివర్గ విస్తరణ కోసమే....
అయితే మంత్రి వర్గ విస్తరణపైనే ఆయన ఢిల్లీ ప్రయాణం జరగనున్నట్లు తెలిసింది. ఇంకా ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉంది. ఎవరిని తీసుకోవాలన్న దానిపై ఇప్పటి వరకూ స్పష్టత రాలేదు. ఆరు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వారిలో ఎవరిని పోటీ చేయించాలన్న దానిపైన కూడా రేవంత్ హైకమాండ్ తో చర్చిస్తారని తెలిసింది. నామినేటెడ్ పదవుల విషయంలోనూ ఢిల్లీ పెద్దల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు.