Revanth Reddy : నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు

Update: 2025-12-02 03:51 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం గాంధీ భవన్ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న అనంతరం రేవంత్ రెడ్డి ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తారు. నిన్న మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కొత్తగూడెం కు వెళుతున్నారు. ముఖ్యమంత్రి సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

గ్లోబల్ సమ్మిట్ కు ...
అయితే ముఖ్యమంత్రి కొత్తగూడెం పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఈరోజు రాత్రి ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి బయలుదేరి వెళతారు. రేపు మోదీతో రేవంత్‌ రెడ్డి సమావేశంకానున్నారు. ఈ నెల 8,9 తేదీల్లో హైదరాబాద్ లో జరగనున్న గ్లోబల్‌ సమ్మిట్‌కు మోదీని రేవంత్ ఆహ్వానించనున్నారు. దీంతో పాటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ను కూడా గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించనున్నారు.


Tags:    

Similar News