Telangana : నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు

Update: 2025-08-25 01:49 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అనుసరించాల్సిన విధానంపై న్యాయనిపుణులతో ఆయన చర్చించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. న్యాయకోవిదులతో చర్చించిన తర్వాత బీసీ రిజర్వేషన్ల అమలుకు చట్టపరమైన సానుకూలతలు, ప్రతికూలతలు తెలసుకునేందుకు చర్చించడానికి వెళుతున్నారు.

న్యాయనిపుణులతో...
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్డినెన్స్ పై గవర్నర్ ఆమోదముద్ర పడకపోవడం, గవర్నర్ నుంచి రాష్ట్రపతి వద్దకు వెళ్లిన ఆర్డినెన్స్ ఐదు నెలల నుంచి పెండింగ్ లో ఉండటం,తో వీరు ఏం చేయాలన్న దానిపై చర్చించనున్నారు. మరొకవైపు సెప్టంబరు 30వ తదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో ఏం చేయాలన్న దానిపై వీరు న్యాయనిపుణులతో చర్చించనున్నారు. అటు నుంచి రాహుల్ గాంధీ బీహార్ లో నిర్వహిస్తున్న ఓటు చోరీ యాత్రలో పాల్గొనేందుకు వెళ్లే అవకాశముంది.


Tags:    

Similar News