Telangana : నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. బీసీ కులగణనపై ఆయన కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ఎంపీలకు అవగాహన కల్పించడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఎంపీలకు అవగాహన కల్పించడం ద్వారా పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడేందుకు అవకాశం కలుగుతుందని ఈ ఏర్పాట్లు చేశారు.
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశముంది. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులను గురించి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. మెట్రో రైలు విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు తదితర అంశాలపై మరొకసారి కేంద్ర మంత్రులను కలసి విజ్ఞప్తి చేయనున్నారు. రేవంత్ రెడ్డి పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేతలను కలిసే అవకాశముంది.