Revanth Reddy : రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం ఆయన ఢిల్లీ వెళతారని తెలిసింది. రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉంటారని సమాచారం. రేపు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ప్రధాని పీవీ సంస్మరణ సభలో పాల్గొనే అవకాశముందని తెలిసింది.
రెండు రోజులు అక్కడే
ఎల్లుండి కూడా ఢిల్లీలోనే ఉండి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలను అందించి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల గురించి చర్చించనున్నారు. అదే సమయంలో పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశముంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమవుతారని చెబుతున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్టీ పెద్దలతో మాట్లాడనున్నారు.