Telangana : భారీ వర్షాలపై నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.
అధికారులతో టెలికాన్ఫరెన్స్...
భారీవర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నదులు, ప్రాజెక్టుల్లోనూ భారీగా నేరు చేరుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించనున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి అవసరమైతే ముందుగానే వాతావరణ శాఖసూచనను అనుసరించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించనున్నారు. గత కొద్ది రోజులుగా హైదరబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.