Revanth Reddy : నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర మంత్రులను కలవనున్నారు

Update: 2025-03-03 02:37 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర మంత్రులను కలవనున్నారు. రేవంత్ రెడ్డి తో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. అనేక ప్రాజెక్టులు తెలంగాణకు రావాల్సి ఉండగా ఇప్పటి వరకూ రాకపోవడం, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు, మెట్రో విస్తరణ వంటి అంశాలపై ప్రధానంగా కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు.

కేంద్ర మంత్రులను కలసి...
దీంతో పాటు తెలంగాణకు పక్కా ఇళ్లను కూడా మంజూరు చేయాలని కోరనున్నారు. ఇప్పటికే తాము ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తగిన సహాయ సహకారాలను అందించాలని రేవంత్ రెడ్డి కోరనున్నారు. ఈ మేరకు ఆయన వివిధ శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను కలసి వినతి పత్రాలను ఇవ్వనున్నారు.


Tags:    

Similar News