Revanth Reddy : నేడు విదేశాలకు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.
CM Revanth Reddy
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఆయన పర్యటన సాగనుంది. రేవంత్ రెడ్డి బృందం అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో కొనసాగుతుంది. ఈ నెల 14వ తేదీ వరకూ రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలోనే ఉంటారు. ముఖ్యమంత్రి వెంట చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ కూడా వెళ్లనున్నారు.
అమెరికా, దక్షిణ కొరియాలలో....
ఈ నెల 4వ తేదీ మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి బృందాన్ని కలవనున్నారు. ఈ నెల 9వ తేదీ వరకూ శాన్‌ఫ్రాన్సిస్కో, డల్లాస్ నగరాల్లో రేవంత్ బృందం పర్యటిస్తుంది. పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానుంది. అమెరికాలో ఉంటున్న ఎన్‌ఆర్ఐలతో సమావేశమై పెట్టుబడులు తెలంగాణలో పెట్టాల్సిందిగా కోరనుంది. ఈ నెల 11న దక్షిణ కొరియా చేరుకుంటారు. అనంతరం అక్కడ పర్యటన ముగించుకుని 14వ తేదీన హైదరాబాద్ కు తిరిగి వస్తారు.