Telangana : నేడు ప్రజాభవన్ కు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రజాభవన్ కు రానున్నారు. ఉద్యోగ నియామకపత్రాలను అందచేయనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రజాభవన్ కు రానున్నారు. ఉద్యోగ నియామకపత్రాలను అందచేయనున్నారు. ప్రజాభవన్ లో 320 మంది కి ఉద్యోగ నియామక పత్రాలను రేవంత్ రెడ్డి అందచేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొంటారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత...
వివిధ శాఖల్లో నియమితులైన 320 మందికి ఉద్యోగ నియామకపత్రాలను అందించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడే ప్రసంగించనున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్లతో పాటు భర్తీ చేసిన ఉద్యోగాల గురించి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించనున్నారు.