Revanth Reddy : నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్

ఈరోజు రాత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు.

Update: 2025-09-08 08:00 GMT

ఈరోజు రాత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెళ్లనున్నారు. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉండటంతో హస్తినకు రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే రేవంత్‌రెడ్డి ఉంటారు. యూరియా కొరతతో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన నష్టంపై కేంద్ర మంత్రులను కూడా రేవంత్ రెడ్డి కలిసే అవకాశముంది.

కేంద్ర మంత్రులను కలిసే...
అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్‌ కోరారు. కొందరు కేంద్ర మంత్రులు బుధవారం అపాయింట్ మెంట్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఎల్లుండి కేంద్ర మంత్రులను కలవనున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి యూరియా కొరత, కేంద్ర నిధులపై సాయం ప్రకటించాలని కోరనున్నారు. ఎల్లుండి రాత్రికి హైదరాబాద్ కు చేరుకుంటారు.


Tags:    

Similar News