త్రివేణి సంగమంలో రేవంత్ పుష్కరస్నానం
సరస్వతి పుష్కరాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్కర స్నానం చేశారు
సరస్వతి పుష్కరాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్కర స్నానం చేశారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబులతో కలసి ఆయన త్రివేణి సంగమంలో స్నానమాచరించారు. తెలంగాణ దక్షిణ కాశి కాళేశ్వరంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సరస్వతీ పుష్కరాలు ఈరోజు ప్రారంభమయిన సంగతి తెలిసిందే.
బస చేసే గృహాలు...
మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పవిత్ర సరస్వతీ పుష్కరాలు జరగనున్నాయి. త్రివేణి సంగమానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ అతిధి గృహాలకు శంకుస్తాపన చేశారు. భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.