Revanth Reddy : నేడు ఢిల్లీలో రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు అంశంపై చర్చించనున్నారు. మెట్రో రైలు రెండో దశ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు మద్దతు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరనున్నారు.
పార్టీ హైకమాండ్ ను కలిసి...
తర్వాత పార్టీ హైకమాండ్ నేతలను కలసి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. తెలంగాణలో మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సంబందించి అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తారు. ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉండంతో అభ్యర్థుల ఎంపికపై చర్చించి ఫైనల్ చేయనున్నారు.