Revanth Reddy : ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్

మాగంటి గోపీనాధ్ మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-11-07 12:12 GMT

మాగంటి గోపీనాధ్ మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరణంపై ఫిర్యాదు ఎవరైనా చేస్తే విచారణ చేస్తామని తెలిపారు. ఏతల్లీ కుమారుడు మరణంపై వివాదం చేయరని అన్నారు. తల్లి చేసిన వ్యాఖ్యలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే పోలీసులు విచారణ చేస్తారని తెలిపారు. ఆ వివాదంలోకి తనను లాగ వద్దని తెలిపారు. విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా సక్రమంగా వ్యవహరించాలన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. బ్లాక్ మెయిల్ కు దిగుతారా? అని నిలదీశారు. మీరు ఏ రాజకీయపార్టీతో అంటకాగుతున్నారో నాకు తెలియదా? అని ప్శ్నించారు. ఇప్పుడు మాట్లాడుతున్న ముగ్గురి గురించి తనకు అన్నీ తెలుసునని చెప్పారు. ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి బంద్ పెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే ఏడాది నుంచి ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారో చూద్దాం అని అన్నారు. విడతల వారీగా నిధులు ఇస్తామని, గత ప్రభుత్వం బకాయీలు పెడితే తాము ఏం చేయాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

విద్య ను సేవగా చేయాలని...
విద్య అనేది సేవగా చేయాలని వ్యాపారం కాదని హెచ్చరించారు. ఏది పడితే అది చేస్తే ప్రభుత్వం సహకరించాలా? అని అన్నారు. తమాషా చేస్తే తాట తీస్తామన్నారు. ఉద్యోగుల జీతభత్యాలను ఇవ్వకుండా మీకు ఇవ్వాలా? అని అన్నారు. మీ వెనక రాజకీయా పార్టీలున్నాయని, ఏది అడిగితే అది అనుమతి ఇవ్వాలా? అని నిలదీశారు. కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అని అన్నారు. కేటీఆర్, కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పదేళ్లలో మీరు చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు.కేటీఆర్ అనే వ్యక్తి ఒక విషపురుగు అని, అతనికి కిషన్ రెడ్డి సహకరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని అందరికీ తెలుసునని రేవంత్ రెడ్డి అన్నారు.
రెండు పార్టీలకూ డిపాజిట్లు కూడా...
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీకి, బీఆర్ఎస్ కు డిపాజట్లు వస్తాయో? లేదో? కేటీఆర్, కిషన్ రెడ్డిలు చెప్పాలన్నారు. ఇద్దరిదీ ఫెవికాల్ బంధమన్న రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసే పనిచేస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణను కోరామని, ఎందుకు ఇంత వరకూ విచారణ చేయలేదో చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గవర్నర్ అనుమతి కోసం ఫార్ములా రేసు కేసులో కోరామని, అయితే గవర్నర్ అనుమతి ఇంత వరకూ అనుమతి ఇవ్వలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. ఒకవేళ అనుమతి లేకుండా అరెస్ట్ చేస్తే వెంటనే బెయిల్ లభిస్తుందని అన్నారు. గంజాయ బ్యాచ్ కు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వాడితే లోపల వేస్తానని హెచ్చరించారు. హైదరాబాద్ అభివృద్ధికి కేటీఆర్, కిషన్ రెడ్డి అడ్డంకిగా మారారని అన్నారు.


Tags:    

Similar News