Revanth Reddy : రండి.. పెట్టుబడులు పెట్టండి.. తెలంగాణ సురక్షితం
హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చుదిద్దుతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చుదిద్దుతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. న్యూఢిల్లీలో పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చడానికి ప్రయత్నిస్తుందని తెలిపారు. మెట్రో రైలు విస్తరణతో పాటు నగరం నలువైపులా విస్తరించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణ పెట్టుబడుదారులకు సర్గధామమనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అన్ని రంగాల్లో పెట్టుబడులకు...
కేవలం ఐటీ రంగంలో మాత్రమే కాదని ఫార్మా రంగంలో కూడా తెలంగాణ ఎన్నో రికార్డులను, రివార్డులను సొంతం చేసుకుందని గుర్తు చేశారు. తెలంగాణలో పెట్టుబడులు సురక్షితమని, వాటికి ఢోకా ఉండదని ముఖ్యమంత్రి తెలిపారు. ఏ రంగంలోనైనా పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ రాష్ట్రం అనుకూలమైనదని ఆయన తెలిపారు. పారిశ్రామికవేత్తలకు ఫ్రెండ్లీగా తమ ప్రభుత్వం ఉండనుందని తెలిపారు. అన్ని రకాలుగా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలను అందిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ రంగంలోనైనా పెట్టుబడి పెట్టేవారికి తమ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానం పలుకుతుందని సమావేశంలో రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు.