Revanth Reddy : గన్ పార్క్ వద్ద అమరవీరులకు రేవంత్ నివాళులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.

Update: 2025-06-02 04:12 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముందుగా ఆయన అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కు వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ కోసం ఎందరో అమరులు తమ ప్రాణాలు త్యాగాలు చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు.

పరేడ్ గ్రౌండ్స్ కు వెళ్లి...
ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా గన్ పార్క్ కు వచ్చారు. గన్ పార్కు నుంచి నేరుగా రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్స్ కు వెళతారు. అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అక్కడ ఉత్తమ ప్రతిభ కనపర్చిన పోలీసులకు మెడల్స్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించనున్నారు. పరేడ్ వేడుకలకు జపాన్ ప్రతినిధుల బృందం హాజరు కానుది.


Tags:    

Similar News