Revanth Reddy : రేవంత్ సంచలన వ్యాఖ్యలు... కేసీఆర్ గవర్నర్ అంటూ?
ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం ఖాయమని తెలిపారు.
CM Revanth Reddy
ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం ఖాయమని తెలిపారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని ఆయన మీడియా చిట్ చాట్ లో అన్నారు. బీఆర్ఎస్ కు రాజ్యసభలో నలుగురు సభ్యులున్నారని, వారిని విలీనం చేస్తే ఫ్యామిలీ ప్యాకేజీ కూడా కేసీఆర్ మాట్లాడుకున్నారన్నారు రేవంత్ రెడ్డి.
కుటుంబానికి పదవులు...
కేసీఆర్ ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా వెళతారన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేశారన్నారు. హరీశ్ రావు తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తారన్నారు. ఇక కవితకు బెయిల్ వస్తుందని, ఆమెకు రాజ్యసభ పదవి ఇచ్చేలా రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.