Revanth Reddy : భూభారతి పోర్టల్ ప్రారంభం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారతి పోర్టల్ ను ప్రారంభించారు

Update: 2025-04-14 13:27 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారతి పోర్టల్ ను ప్రారంభించారు. భూభారతి పోర్టల్ పై అవగాహన కల్పించేందుకు అవసరమైన సదస్సులను ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూభారతి కి సంబంధించి ప్రజల నుంచి వచ్చే అనుమానాలను తొలగించి వారిలో పూర్తి విశ్వాసాన్ని నింపాలన్నారు.

భూ భారతి వల్ల ప్రయోజనాలను...
భూ భారతి వల్ల ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అదే సమయంలో ఇప్పటి వరకూ భూముల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ భూభారతి ద్వారా తొలగించాలని కూడా కోరారు. భూభారతి వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం లేదని, ప్రయోజనాలు ఏంటో సవివరంగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.


Tags:    

Similar News