Revanth Reddy: ఆ సన్నాసుల గురించి పట్టించుకోను

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్ష నేతలపై మండి పడ్డారు.

Update: 2025-05-19 11:48 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్ష నేతలపై మండి పడ్డారు. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో కొందరు సన్నాసులు చేసే కామెంట్స్ ను తాను పట్టించుకోనని అన్నారు. ఆ ఐదుగురు సన్నాసులు తనకు లెక్క కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల లబ్దిపొందిన వారు తమను గుర్తు పెట్టుకుంటే చాలునని రేవంత్ రెడ్డి అన్నారు. అనేక మంది తమ ప్రభుత్వంపై విషం చిమ్మాలని చూస్తున్నారని, వాళ్ల గురించి ఎవరూ పట్టించుకోవాల్సిన పనిలేదన్న రేవంత్ రెడ్డి కేవలం ఐదారుగురు సన్నాసులకు భయపడి పాలన చేయడం లేదని, ఐదు కోట్ల ప్రజల ఆంకాంక్షలను నెరవేర్చేందుకు తాము పనిచేస్తున్నామని తెలిపారు.

పేద ప్రజల సంక్షేమం కోసమే...
పేద ప్రజల సంక్షేమం కోసమే తాము పని చేస్తున్నామని అన్నారు. రైతుల కోసం ఇప్పటి వరకూ అరవై వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. వరి సన్నాలు పండిస్తే అయిదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నామని కూడా రేవంత్ చెప్పారు. నిరుద్యోగుల కోసం త్వరలో నోటిఫికేషన్లు ఇస్తున్నామని, నాడు నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆందోళన చేస్తే, నేడు రద్దు చేయాలని ఆందోళన చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం పేదల పట్ల సానుకూలంగా ఉంటుందని, వారి సంక్షేమం కోసమే పనిచేస్తుందని చెప్పారు. ఎవరేమి అనుకున్నా పట్టించుకోకుండా ముందుకు వెళుతున్నామని, రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకున్నదీ తమ ప్రభుత్వమేనని ఆయన తెలిపారు.


Tags:    

Similar News