Revanth Reddy : నేడు జపాన్ లో రేవంత్ షెడ్యూల్ ఇదే

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కూడా జపాన్ లో పర్యటిస్తున్నారు.

Update: 2025-04-21 06:25 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కూడా జపాన్ లో పర్యటిస్తున్నారు. నేడు యుమెషిమాలో జరిగే వరల్డ్ ఎక్స్ పో, తెలంగాణ పెవిలియన్ ను కూడా ప్రారంభించనున్నారు. గత కొద్ది రోజులుగా జపాన్ లో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి బృందం పెట్టుబడుల వేటను కొనసాగిస్తుంది. ఇప్పటికే అనేక కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

జపాన్ లో పర్యటిస్తూ...
రేవంత్ రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. అధికారులతో కలసి ఆయన జపాన్ లో పర్యటిస్తున్నారు. ఈరోజు యుమెషిమాలో జరిగే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఒసాకా రివర్ ఫ్రంట్ ను కూడా నేడు రేవంత్ రెడ్డి బృందం సందర్శించనుంది. అసెంబ్లీ ఛైర్మన్ తో కూడా రేవంత్ రెడ్డి బృందం సమావేశం కానుంది.


Tags:    

Similar News