Revanth Reddy : నేడు కూడా ఢిల్లీలోనే రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కూడా ఢిల్లీలో పర్యటిస్తున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కూడా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలవనున్నారు. రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న కులగణన సభలకు రావాలని ఆహ్వానించనున్నారు. ఈరోజు కాంగ్రెస్ హైకమాండ్ నేతలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవనున్నారు. వారిని కూడా కులగణన సభలకు రావాలని కోరనున్నారు.
అనేక అంశాలపై చర్చ..
దీంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని ఏ విధంగా సిద్ధం చేస్తున్నది ముఖ్యమంత్రి నేతలకు వివరించనున్నారు. దీంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేతలతో చర్చించే అవకాశముంది. సాయంత్రానికి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారు.