Revanth Reddy : నేడు రెండో రోజు ఢిల్లీలో రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నిన్న ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు కేంద్రమంత్రులను కలిశారు. ప్రధానంగా కృష్ణా జలాల కేటాయింపులు, ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టనున్న బనకచర్ల ప్రాజెక్టు పై ఆయన అభ్యంతరం తెలిపారు. గోదావరి నీటి కేటాయింపులు జరిగేంత వరకూ ఎలాంటి ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతివ్వవద్దని కోరారు.
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై...
అయితే నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పార్టీ పెద్దలను కలిసే అవకాశముంది. తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఖరారు విషయంలో ఆయన స్పష్టత తీసుకోనున్నారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నాలుగు స్థానాలు కాంగ్రెస్ కు దక్కే అవకాశముండటంతో రేవంత్ రెడ్డి అభ్యర్థుల పేర్లను ఖరారు చేయాలని కోరనున్నారు.