Telangana : రేవంత్ రెడ్డి రెండో రోజు కేంద్ర మంత్రుల వరస భేటీలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులను కలుస్తున్నారు

Update: 2025-03-04 12:50 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులను కలుస్తున్నారు. ప్రహ్లాద్ జోషిని కలసి రాష్ట్రానికి రావాల్సిన రెండు వేల కోట్ల రూపాయల బకాయీలను వెంటనే చెల్లించాలని ఆయనను కోరారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలసి ఆయన రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పౌర సరఫరాల శాఖకు సంబంధించిన బకాయీలను వెంటనే చెల్లించాలని కోరారు.

బకాయీలను విడుదల చేయాలని...
ఇందుకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సానుకూలంగా స్పందించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. 2014-15 సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు రూ. 1,468.94 కోట్లను విడుదల చేయాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన రూ. 343.27 కోట్ల బకాయిలను విడుదల చేయాలని, కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ గడువును పొడిగించాలని కోరారు.


Tags:    

Similar News