Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీ బీజీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయన ఈరోజు పార్టీ పెద్దలను కలవనున్నారు. మంత్రి వర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పదవులపై పార్టీ అగ్రనేతలతో చర్చించే అవకాశాలున్నాయి. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ ను కూడా రేవంత్ ను కలవనున్నారు.
ఏడాదవుతున్నా...
అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పైగానే అవుతున్నా మంత్రి వర్గ విస్తరణ జరగకపోవడంతో నేతల్లో అసంతృప్తి నెలకొంది. నేతలు మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడంటూ నేతలు నిలదీసే పరిస్థితికి వచ్చింది. కొన్ని జిల్లాలకు మంత్రులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో త్వరగా మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలను కోరనున్నారు.