Revanth Reddy : నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. రాత్రి ఏడు గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. రేపు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. ప్రధానంగా మెట్రో రైలు విస్తరణ, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులకు సంబంధించి అనుమతుల కోసం ఆయన కేంద్ర మంత్రులను కలిసే అవకాశముందని తెలిసింది.
కేంద్ర మంత్రులను కలిసి...
దీంతో పాటు రీజనల్ రింగ్ రోడ్డు వ్యవహారంపై నితిన్ గడ్కరీని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసే అవకాశాలున్నాయని సమాచారం. దీంతో పాటు పార్టీ కీలక నేతలతోనూ రేవంత్ రెడ్డి సమావేశమవుతారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పడంతో పాటు పలు రాజకీయ పరిణామాలపై కూడా రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో చర్చించే అవకాశముంది.