Revanth Reddy : రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని నిర్ణయించారు. తల్లిదండ్రులను పట్టించుకోనిఉద్యోగుల జీతాల్లోనుంచి పదిహేను శాతం కోత విధించి ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశించారు.
వృద్ధాప్యంలో తల్లిదండ్రులను...
ఇటీవల కొన్నిసంఘటనలు వెలుగు చూడటం, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోకుండా, ఆస్తులను మాత్రం సొంతం చేసుకున్న వారి సంఘటనలు బయటకు రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఎంత మంది తల్లిదండ్రులు ఉన్నారో పరిశీలించాలని, తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.