Revanth Reddy : ఆర్టీసీ కార్మిక సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్

ఆర్టీసీ కార్మికసంఘాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

Update: 2025-05-05 12:44 GMT

ఆర్టీసీ కార్మికసంఘాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలపై సమరం చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉన్న పరిస్థితులతో పాటు ఆర్థిక పరిస్థితులను కూడా గుర్తించాలని కోరారు. ఏ పథకాన్ని ఆపాలో యూనియన్ నేతలు చెప్పాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ధరలు పెంచకుండా, పథకాలు ఆపకుండా కొత్త కోర్కెలు నెరవేరవని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఎవరికి నష్టమని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వృద్ధాప్య పింఛన్లను ఆపమంటారా? లేక సన్న బియ్యం నిలిపేయమంటారా? ఇవన్నీ ఆపేసి బోనస్ లు ఇవ్వాలా? లేక జీతాలు పెంచాలా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

రాజకీయ నేతల ఉచ్చులో పడవద్దంటూ...
రాజకీయ నేతల ఉచ్చులో పడవద్దని కార్మిక సంఘాలు సూచించాయి. మొదటి తేదీన జీతాలు ఇస్తున్నందుకు సమ్మె చేస్తారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం పన్నులు చెల్లిస్తేనే మీరు, మేము జీతాలు తీసుకుని పనిచేస్తున్నామని కార్మిక సంఘాలు గుర్తుంచుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు. కనీసం అప్పులు కూడా పుట్టని పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్టేనా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సమ్మె చేస్తే ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని, దాని వల్ల ఎవరికి నష్టమని వారు ప్రశ్నించారు.


Tags:    

Similar News