Revanth Reddy : మహిళలకు గుడ్ న్యూస్.. వారికే టిక్కెట్లు

రాష్ట్రంలో ప్రతి తల్లి తమ ఇంట్లో రెండు మొక్కలు పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు నిచ్చారు.

Update: 2025-07-07 05:11 GMT

రాష్ట్రంలో ప్రతి తల్లి తమ ఇంట్లో రెండు మొక్కలు పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు నిచ్చారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన వనమహోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మొక్కలు నాటి తర్వాత జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. వనం పెంచితేనే మనం క్షేమంగా ఉండగలమని రేవంత్ రెడ్డి తెలిపారు. తల్లులు మొక్కలు నాటితే పిల్లలను చూసుకున్నట్లే జాగ్రత్తగా చూసుకుంటారని, పిల్లలు కూడా తమ తల్లుల పేరు మీదుగా మొక్కలు నాటి సంరక్షించాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు నిచ్చారు.

సంక్షేమ పథకాలు...
మహిళలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల కోసం వివిధ సంక్షేమపథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా వారికి మహిళ రిజర్వేషన్లు ప్రవేశపెడతామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో అధిక శాతం టిక్కెట్లు మహిళలకే కేటాయించనున్నట్లు తెలిపారు. వారిని గెలిపించే బాధ్యత కూడా తాను తీసుకుంటానని రేవంత్ రెడ్డి తెలిపారు. సోలార్ ప్రాజెక్టులు, పెట్రోలు బంకులు కూడా మహిళలకు కేటాయించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని రేవంత్ రెడ్డి తెలిపారు.


Tags:    

Similar News