Revanth Reddy : అందరికీ టిక్కెట్లు.. నేతలకు రేవంత్ భరోసా

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస నేతలకు భరోసా ఇచ్చారు.

Update: 2025-07-04 13:14 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస నేతలకు భరోసా ఇచ్చారు. సామాజిక న్యాయ సమర భేరి సదస్సులో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ స్థానాలు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు. దాదాపు చాలామందికి టిక్కెట్లు వస్తాయని అన్నారు. ఎవరూ నిరాశకు లోను కావద్దని, వచ్చే ఎన్నికల్లో వందకు సీట్లకుపైగా గెలిచి తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అన్నారు. తెలంగాణలో ఈసారి జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా పదిహేను పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ను గెలిపించి కేంద్రంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తామన్నారు.

తిరిగి అధికారంలోకి రావడం...
ఇందుకు తెలంగాణకాంగ్రెస్ ఖచ్చితంగా కేంద్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి తోడ్పడుతుందని తెలిపారు. అలాగే మున్సిపాలిటీ, కార్పొరేషన్, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచిపోటీ చేసిన వారందరినీ గెలిపించుకుని తీరతామని చెప్పారు. అందరికీ ఏదో ఒక పదవి వస్తుందని, అందులో నిరాశపడవద్దని అన్నారు. బీఆర్ఎస్ పనిఅయిపోయిందని, ఇప్పుడు ప్రభుత్వం చేసిన పనులను ప్రభుత్వానికి వివరించగలిగితే మన విజయాన్ని ఎవరూ ఆపలేరని రేవంత్ రెడ్డి అన్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దే విజయమని చెప్పారు.



Tags:    

Similar News